ఇండక్షన్‌ స్టవ్‌తో జాగ్రత్త! | Induction stove and precautions | Sakshi
Sakshi News home page

ఇండక్షన్‌ స్టవ్‌తో జాగ్రత్త!

Sep 1 2018 3:51 AM | Updated on Sep 1 2018 3:51 AM

Induction stove and  precautions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తూ వంటింటి చికాకులకు ఫుల్‌స్టాప్‌ పెట్టేది ఇండక్షన్‌ స్టవ్‌. అయితే ఈ కరెంట్‌ పొయ్యి వాడకంలో కొన్ని ప్రమాదాలున్నాయి. వండే సమయంలో ఏమాత్రం పొరపాటుగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఇండక్షన్‌ స్టవ్‌ వాడకంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలివి...

మెటల్‌ ప్యానెల్‌ ఉన్న పాత్రలనే వాడాలి. వంట పూర్తయిన తర్వాత స్టవ్‌ పై నుంచి పాత్రలను తీసేటప్పుడు స్విచ్చాఫ్‌ చేయడం మరిచిపోవద్దు.
 ఇండక్షన్‌ స్టవ్‌ నుంచి తీవ్రమైన వేడి వెలువడుతుంది. స్టవ్‌ దగ్గర్లో ప్లాస్టివ్‌ వస్తువులు, బట్టలు ఉంటే ప్రమాదకరం.
   వండే సమయంలో స్టవ్‌పై నీళ్లు కానీ, ఇతర ద్రవ పదార్థాలు కానీ పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్ట్టవ్‌ మన్నిక తగ్గడంతో పాటూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
 ఇండక్షన్‌ స్టవ్‌లను క్లీన్‌ చేయడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెత్తటి పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. నీటితో గానీ తడి బట్టతో గానీ క్లీన్‌ చేయకూడదు.
మన్నికైన స్విచ్‌బోర్డ్‌ ద్వారా కరెంట్‌ సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఎక్స్‌టెన్షన్‌ బాక్స్‌లను వాడటం ఏమాత్రం మంచిది కాదు.
   వంట పూర్తయిన తర్వాత కేవలం స్విచ్ఛాఫ్‌ చేసేసి ఊరుకోవద్దు. పిన్‌ నుంచి ప్లగ్‌ను తొలగించడం కూడా తప్పనిసరి.

Advertisement
 
Advertisement
Advertisement