హీరోమోటో కొత్త  బై బ్యాక్‌ స్కీం | Hero MotoCorp Launches buyback Scheme for Scooters | Sakshi
Sakshi News home page

హీరోమోటో కొత్త  బై బ్యాక్‌ స్కీం

May 6 2019 8:28 PM | Updated on May 6 2019 8:28 PM

Hero MotoCorp Launches buyback Scheme for Scooters - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన  వినియోగదారుల కోసం  ఒక  వినూత్న పథకాన్ని ప్రారంభించింది. స్కూటర్‌ కొనుగోలుదారుల కోసంబైస్యూరెన్స్‌ పేరుతో ఇప్పటికే పుణే మార్కెట్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ పథకాన్ని కంపెనీ తాజాగా ఢిల్లీ, బెంగళూరు మార్కెట్లలో  ప్రవేశపెట్టింది.

ఈ పథకం కింద, కొత్త హీరో స్కూటర్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్‌కు ఒక  గ్యారంటీడ్‌ బై బ్యాక్‌ సర్టిఫికెట్‌ ఇస్తుంది.  టూవీలర్‌ బ్రాండ్ క్రెడర్‌ ద్వారా  ఈ సర్టిఫికెట్‌ను అందిస్తుంది.   రాబోయే ఐదేళ్లలో ఆరునెలల్లో వ్యవధిలో  ఈ బై బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తుంది.

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ఇలాంటి ఆఫర్‌ ఇవ్వడం ఇదే మొదటి సారని హీరో మోటో కార్ప్ హెడ్ (అమ్మకాలు మరియు సేల్స్ తర్వాత) సంజయ్ భన్ చెప్పారు. దీని ద్వారా హీరో మోటో కార్ప్ వినియోగదారులకు  రీ సేల్‌పై భరోసా లభిస్తుందని తెలిపారు.  ప్రస్తుతం ప్రణాళిక పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న ఈ పథకాన్ని త్వరలోనే  దేశంలో టాప్‌ 10 మార్కెట్లలో కూడా కలిస్తామన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement