రూ.1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం: డాలర్ ఇండస్ట్రీస్ | Dollar Industries eyes South to increase market share | Sakshi
Sakshi News home page

రూ.1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం: డాలర్ ఇండస్ట్రీస్

Jun 16 2016 1:12 AM | Updated on Sep 4 2017 2:33 AM

రూ.1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం: డాలర్ ఇండస్ట్రీస్

రూ.1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం: డాలర్ ఇండస్ట్రీస్

నిట్‌వేర్ తయారీ కంపెనీ డాలర్ ఇండస్ట్రీస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం వృద్ధి చెంది రూ.26 కోట్లకు పెరిగింది.

హైదరాబాద్: నిట్‌వేర్ తయారీ కంపెనీ డాలర్ ఇండస్ట్రీస్  నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం వృద్ధి చెంది రూ.26 కోట్లకు పెరిగింది. రూ.830 కోట్ల టర్నోవర్ సాధించామని డాలర్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని డాలర్ ఇండస్ట్రీస్ ఎండీ, వినోద్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఆరేళ్లలో మంచి వృద్ధి సాధించడానికి తమ బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్‌కుమార్ కీలక పాత్ర పోషించారని, ఆయన వల్ల డాలర్ బ్రాండ్‌కు మంచి గుర్తింపు వచ్చిందని వివరించారు. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తమ కంపెనీ వందలాది ఉద్యోగాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. ఆరేళ్ల పాటు డాలర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడం సంతోషంగా ఉందని బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement