ఎక్సైజ్ సుంకం పెంపు ఫలితం
ఉత్పత్తి వ్యయాలు పెరగడమూ మరో కారణం
ముంబై: ఇటీవల ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం రాయితీలు తొలగించడంతో పాటు ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో వాహన కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్నాయి. జనరల్ మోటార్స్, హోండా కార్స్, హ్యుందాయ్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియాలు మంగళవారం ధరలను పెంపును ప్రకటించగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, బజాజ్ ఆటో కంపెనీలు కూడా త్వరలో పెంచనున్నాయి. షెవర్లే వాహనాల ధరలను మోడళ్లను బట్టి రూ.15,000 నుంచి రూ.61,000 వరకూ పెంచుతున్నామని జనరల్ మోటార్స్ పేర్కొంది. హోండా కార్స్ ఇండియా కంపెనీ తన కార్ల (హోండా సిటీ, అమేజ్ తదితర మోడళ్లు) ధరలను రూ 60,000 వరకూ పెంచింది.
మారుతీ పెంపు రూ.31,600 వరకూ
మారుతీ సుజుకీ కంపెనీ తన కార్ల ధరలను రూ.7,850 నుంచి రూ.31,600 వరకూ పెంచింది. ఓమ్ని ధరలు రూ.7.850 నుంచి రూ.9,950 వరకూ, ఆల్టో ధరలు రూ.8,500 నుంచి రూ.12,700 వరకూ, వ్యాగన్ఆర్ ధరలు రూ.12,500 నుంచి రూ.15,700 వరకూ, స్విఫ్ట్ ధరలు రూ.15,850 నుంచి రూ.25,150 వరకూ, డిజైర్ ధరలు రూ.17,500 నుంచి రూ.26,650 వరకూ, సెలెరియో ధరలు రూ.13,600 నుంచి రూ.17,200 వరకూ, ఎర్టిగ ధరలు రూ.18,750 నుంచి రూ.27,750 వరకూ, సియాజ్ ధరలు రూ.22,450 నుంచి రూ.31,600 వరకూ పెరుగుతాయని పేర్కొంది.
హ్యుందాయ్ పెంపు రూ.1.27 లక్షల వరకూ
హ్యుందాయ్ మోటార్ వాహనాల ధరలను రూ.15,000 నుంచి రూ.1,27,000 వరకూ పెంచింది. ఎంట్రీ లెవల్ కారు ఈఆన్ ధరలను రూ.15,417, ఐ10 ధరలను రూ.21,501, గ్రాండ్ ఐ10 ధరలను రూ.22,508 వరకూ పెంచింది. కాంపాక్ట్సెడాన్ ఎక్సెంట్ ధరలను రూ.25,597, ప్రీమియం హ్యాచ్‌బాక్ ఇలీట్ ఐ20 ధరలను రూ.29,814, మిడ్ సైజ్ సెడాన్ వెర్నా ధరలను రూ.23,965, ఎగ్జిక్యూటివ్ సెడాన్ ఎలంత్ర ధరలను రూ.36,912, సొనాట ధరను రూ.45,396, శాంటాఫై ధరలను రూ.1.27 లక్షలకు పెంచింది. సుంకం పెంపు కారణంగా టూవీలర్ల ధరలను 2,000-7,000 రేంజ్లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ధరలను పెంచిందని సమాచారం.
ఈ నెల 1 నుంచి తయారైన వాహనాలకే పెరిగిన ఎక్సైజ్ రేట్లు వర్తిస్తాయి కాబట్టి గత ఏడాది తయారైన కార్లకు ఎక్సైజ్ సుంకం పెంపు వర్తించదు. అమ్మకాలు పెంచుకునే వ్యూహాంలో భాగంగా కంపెనీలు/డీలర్లు పాత ధరలకే ఈ వాహనాలను ఆఫర్ చేయవచ్చని నిపుణులంటున్నారు.
కార్ల ధరలు పెరిగాయ్
Published Wed, Jan 7 2015 1:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement