ఎలక్ట్రిక్ 'ఐకార్'కు డీల్ కుదిరిందట | Apple Ends 'iCar' Cooperation Talks With BMW, Daimler: Report | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్ 'ఐకార్'కు డీల్ కుదిరిందట

Apr 26 2016 4:14 PM | Updated on Aug 20 2018 2:55 PM

ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థలు బీఎమ్ డబ్ల్యూ, డైమ్లెర్ లు సరికొత్త ఎలక్ట్రిక్ కార్ రూపొందించడానికి యాపిల్ తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.

ముంబై : ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థలు బీఎమ్ డబ్ల్యూ, డైమ్లెర్ లు సరికొత్త ఎలక్ట్రిక్ కారు రూపొందించడానికి యాపిల్ తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ సహకార ఒప్పందానికి యాపిల్ నుంచి ఆమోదం లభించిందట. ఈ డీల్ తో టెక్నాలజీ దిగ్గజం యాపిల్, ప్రముఖ కార్ల కంపెనీ లు సంయుక్తంగా మార్కెట్లోకి వినూత్నమైన ఎలక్ట్రిక్ 'ఐకార్'ను తీసుకురానున్నాయని పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై స్పందించడానికి యాపిల్, బీఎమ్ డబ్ల్యూయూ, డైమ్లెర్ సంస్థలు తిరస్కరించాయి. ఓ జర్మన్ డైలీ గతేడాది బీఎమ్ డబ్ల్యూతో, ఇటీవల డైమ్లెర్ తో మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది.

యాపిల్ ఎప్పటినుంచో మంచి నైపుణ్యాలు కలిగిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ కోసం చూస్తుందని, ముఖ్యంగా జర్మనీ సంస్థల వైపు గూగుల్ కన్నేసిందని రిపోర్టు చెబుతోంది. గూగుల్ కు పోటీగా యాపిల్ ఎప్పటినుంచో సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్లను తయారుచేయాలని సన్నాహాలు చేస్తోంది.

గూగుల్, యాపిల్ సంస్థలే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొన్ని టెక్నాలజీ దిగ్గజాలు కూడా కార్ల తయారీ సంస్థలతో కలిసి ఇంటర్నెట్ కనెక్షన్ కార్లు లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీలో పాల్గొంటున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇటీవలే సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ 'ఆటోపైలెట్'ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరోవైపు కెనడియన్-ఆస్ట్రేయన్ సంస్థ మాగ్న కూడా యాపిల్ తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement