యాప్‌కీ కహానీ... | App KiKahani ... | Sakshi
Sakshi News home page

యాప్‌కీ కహానీ...

Jan 22 2018 12:25 AM | Updated on Aug 20 2018 2:35 PM

App KiKahani ... - Sakshi

రానున్న ఐపీఓలు, ఎస్‌ఎంఈ ఐపీఓలు, ఎన్‌సీడీలు, బాండ్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు ‘ఐపీఓ గైడ్‌’ యాప్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు
రన్నింగ్‌/అప్‌కమింగ్‌ ఐపీఓల సమాచారం తెలుసుకోవచ్చు.
 రానున్న ఎస్‌ఎంఈ ఐపీఓలు, ఎన్‌సీడీలు, బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు చూడొచ్చు.
స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించిన స్టాక్‌ టిప్స్‌ పొందొచ్చు.
 ఐపీఓలో పాల్గొన్నవారు అలాట్‌మెంట్‌ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. అలాగే రానున్న ఐపీఓలకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నవారు బేసిక్‌ వివరాలు అందిస్తే సంస్థ ఎగ్జిక్యూటివ్స్‌ ఐపీఓ/ఎన్‌సీడీ/బాండ్ల దరఖాస్తుకు సహాయపడతారు.   
యాప్‌లో ఐపీఓ/ఎన్‌సీడీ/ ఎస్‌ఎంఈ ఐపీఓ/ బాండ్లకు సంబంధించిన ఐపీఓ తేదీ, ప్రైస్‌ బ్యాండ్, లిస్టింగ్‌ తేదీ, సబ్‌స్క్రిప్షన్‌ వివరాలు, కంపెనీ సమాచారం వంటి వివరాలు అందుబాటులో ఉన్నాయి.
 ఐపీఓల పనితీరు ఎలా ఉందో గమనించొచ్చు.  
  ఐపీఓ ఎప్పుడు ప్రారంభమౌతుంది.. ఎప్పుడు ముగుస్తుంది.. ఎప్పుడు లిస్టవుతుంది.. వంటి విషయాలను అలర్ట్స్‌ రూపంలో పొందొచ్చు.
 ఐపీఓ క్యాలెండర్‌ కూడా అందుబాటులో ఉంది.

గమనిక:    కేవలం ఈ యాప్‌ ఆధారంగా మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమం కాదు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ను సంప్రదించండి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement