త్వరలో రాకెట్‌ వేగంతో ప్రయాణించే కారు.. | 15 crore supercar missile on wheels Releasing Shortly | Sakshi
Sakshi News home page

త్వరలో రాకెట్‌ వేగంతో ప్రయాణించే కారు..

Dec 11 2019 8:11 PM | Updated on Dec 11 2019 8:59 PM

15 crore supercar missile on wheels Releasing Shortly  - Sakshi

త్వరలో రాకెట్‌ వేగంతో ప్రయాణించే కారు మన మధ్యలో ఉండబోతుంది. గోర్డాన్‌ ముర్రే డిజైనర్‌ టీమ్‌ రూపకల్పన చేసిన సరికొత్త సంచలనం టీ.50. ముగ్గురు ప్రయాణించే విధంగా రూపకల్పన చేశారు. ముర్రే బృందం రేసింగ్ పాయింట్ ఫార్ములా వన్‌(ఆర్‌పీఎఫ్ఓ‌)తో ఉమ్మడిగా ఈ సరికొత్త ప్రాజెక్టును రూపొందిస్తోంది. ఈ కారు ధర 15.71 కోట్ల అని కంపెనీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది మేలో కారుకు సంబంధించిన అధికారిక ఫోటోను విడుదల చేయనున్నారు.

కనీవినీ ఎరుగనీ అధునాతన ఏరో డైనమిక్స్‌తో రూపొందించామని కంపెనీ వర్గాలు తెలిపాయి. సూపర్ కార్ బరువు 980 కిలోలు. ఇది 12,100 ఆర్‌పీఎమ్‌ను కలిగి ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోనే ఆధునాతన టెక్నాలజీతో కారును రూపోందించామని గోర్డాన్‌ ముర్రే గ్రూప్‌ చైర్మన్‌ పేర్కొన్నారు. ఈ కారు అమెరికా, జపాన్‌ ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారని కంపెనీ పేర్కొంది. మరోవైపు  గోర్డాన్‌ ముర్రే టీమ్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆర్‌పీఎఫ్ఓ‌ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement