ఆదర్శమూర్తి విజయమ్మ | YS Vijayamma grand birthday celebration | Sakshi
Sakshi News home page

ఆదర్శమూర్తి విజయమ్మ

Apr 20 2016 2:22 AM | Updated on May 29 2018 4:23 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై వేధించినా, కష్ట కాలంలోనూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పార్టీని విజయబాటలో ...

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు

 

తిరుపతి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై వేధించినా, కష్ట కాలంలోనూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పార్టీని విజయబాటలో నడిపించిన ఆదర్శమూర్తి వైఎస్ విజయమ్మ అని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు కొనియాడారు. తిరుపతిలోని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ నిరంతరం ప్రజల అభివృద్ది కోసం తపించే మహోన్నత వ్యక్తి విజయమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు వాసు, మాజీ ఎంపీటీసీ నల్లందుల సుధాకర్‌రెడ్డి, చిన్న, హరిబాబు, వీరనారాయణరెడ్డిలు పాల్గొన్నారు.


మహిళా విభాగం ఆధ్వర్యంలో..
రూరల్ మహిళా విభాగం రూరల్ మండల అధ్యక్షురాలు మొక్కల భారతి ఆధ్వర్యంలో సీమల్లవరం పంచాయతీలో వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాలు సావిత్రి, రమణమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement