కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య | woman committed suicide due to family problems | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

Mar 20 2015 3:11 PM | Updated on Sep 2 2017 11:09 PM

కుటుంబ కలహాల కారణంగా ఐదు నెలల గర్భవతి ఆత్మహత్యకు పాల్పడింది

ఎర్రగుంట్ల :కుటుంబ కలహాల కారణంగా ఐదు నెలల గర్భవతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఎర్రగుంట్ల మండలంలోని వలసపల్లె గ్రామానికి చెందిన విజయలక్ష్మి(25)  ఏడాది కిందట అదే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది.

 

అయితే అత్తవారింట్లో తరచూ వేధింపులకు గురికావడంతో మనస్తాపం చెందిన విజయలక్ష్మి శుక్రవారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి మంటలు ఆర్పేలోపే మంటల్లో పూర్తిగా  చిక్కుకున్న ఆమె మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement