మాఫీ కాకుండానే రుణమాఫీ పత్రాలు | Without waiver of loan waiver documents Came of the former | Sakshi
Sakshi News home page

మాఫీ కాకుండానే రుణమాఫీ పత్రాలు

Jan 6 2016 3:51 PM | Updated on Oct 1 2018 1:21 PM

ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ఓ రైతుకు షాకిచ్చింది. రుణమాఫీ కాకుండానే.. పూర్తిగా వ్యవసాయ రుణం మాఫీ అయినట్లు ఇంటికి పత్రాలు వచ్చాయి.

ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ఓ రైతుకు షాకిచ్చింది. రుణమాఫీ కాకుండానే.. పూర్తిగా వ్యవసాయ రుణం మాఫీ అయినట్లు ఇంటికి పత్రాలు వచ్చాయి. ఈ ఘటన చంద్రగిరి మండలం కల్ రోడ్డు పంచాయతీ లోని మిట్టూరు గ్రామానికి చెందిన కొమ్మినేని దామోదరం నాయుడు రుణమాఫీ పత్రాలు అందుకున్నాడు.


కల్ రోడ్డు పంచాయతీ లో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ గిర్వానీ హాజరయ్యారు. దీంతో కార్యక్రమంలో పాల్గొన్న దామోదరం నాయుడు జడ్ పీ చైర్మన్ ను రుణమాఫీ పై నిలదీశారు. ఎలాంటి రుణమాఫీ జరగ కుండానే.. తనకు ఉన్న రూ.39 వేల రుణం మాఫీ అయినట్లు పత్రాలు వచ్చాయని తెలిపారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేవలం రుణమాఫీ చేశామని చెప్పుకోవడమే.. రైతులకు ఒక్క పైసా కూడా రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. రైతు రుణమాఫీ విషయంలో అధికార పార్టీకి చెందిన వారిని నిలదీయడంతో.. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక.. నీళ్లు నమిలారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement