రైతు ఇంటిపై తుపాకీతో దాడికి యత్నం | unknown persons hulchul in visakhapatnam district | Sakshi
Sakshi News home page

రైతు ఇంటిపై తుపాకీతో దాడికి యత్నం

Apr 3 2016 2:07 PM | Updated on Oct 1 2018 2:44 PM

విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం జుత్తాడపాలెంలో ఆదివారం నాటు తుపాకీ కలకలం సృష్టించింది.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం జుత్తాడపాలెంలో ఆదివారం నాటు తుపాకీ కలకలం సృష్టించింది. దేవుడు అనే రైతు ఇంటిపై నాటు తుపాకీతో దుండగుల దాడికి యత్నించారు. దీంతో దేవుడు కుటుంబ సభ్యులు బిగ్గర అరవడంతో దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు.

వారిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ వారు అప్పటికే పరారైయ్యారు.  అయితే సంఘటన స్థలంలో బుల్లెట్ లభ్యమైంది. దేవుడు కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement