బోయకొండ వద్ద మరో ప్రమాదం; ఇద్దరి పరిస్థితి విషమం | Two injured in Bike accident at Boyakonda | Sakshi
Sakshi News home page

బోయకొండ వద్ద మరో ప్రమాదం; ఇద్దరి పరిస్థితి విషమం

Jun 7 2015 6:41 PM | Updated on Sep 3 2017 3:23 AM

బోయకొండ వద్ద వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుండ్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

చౌడేపల్లి(చిత్తూరు జిల్లా): బోయకొండ వద్ద వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుండ్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. బోయకొండలోని గంగమ్మ ఆలయానికి వెళ్లి వస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి గుండ్లను ఢీ కొట్టింది.

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, ట్రాక్టర్ లోయలో పడిన సంఘటనకు 100 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement