కిలో టమాటా ఒక్క రూపాయికే! | Tomato prices crash | Sakshi
Sakshi News home page

కిలో టమాటా ఒక్క రూపాయికే!

Sep 12 2015 4:11 PM | Updated on Sep 3 2017 9:16 AM

టమాటా ధర కనిష్ట స్థాయికి పడిపోవటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు.

కూడేరు (అనంతపురం) : టమాటా ధర కనిష్ట స్థాయికి పడిపోవటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. మార్కెట్‌కు తీసుకువచ్చిన టమాటా పంటను ధర గిట్టుబాటు కాకపోవటంతో తిరిగి తీసుకెళ్లలేక రోడ్డు పక్కనే పారబోసి వెళ్లిపోతున్నారు. ఇది అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలోని పరిస్థితి.

మండలంలో దాదాపు 300 ల ఎకరాల్లో టమాటా పంట పండిస్తున్నారు. అయితే గత రెండు మూడు రోజులుగా టమాటా ధర మార్కెట్‌లో బాగా పడిపోయింది. శనివారం కిలో రూ.1కి తగ్గిపోవటంతో రైతులు రోడ్డు పక్కన పారబోశారు. కొందరు రైతులు పంటను కోయకుండా చేలల్లోనే వదిలేశారు.

Advertisement
 
Advertisement
Advertisement