నేడు విజయమ్మ వైఎస్సార్ జనభేరి | today Y. S. Vijayamma YSR Janabheri | Sakshi
Sakshi News home page

నేడు విజయమ్మ వైఎస్సార్ జనభేరి

Apr 27 2014 12:57 AM | Updated on May 29 2018 4:06 PM

నేడు విజయమ్మ వైఎస్సార్ జనభేరి - Sakshi

నేడు విజయమ్మ వైఎస్సార్ జనభేరి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగాజిల్లాలో వైఎస్సార్ జనభేరి రెండో విడత రెండో రోజూ కొనసాగించనున్నారు.

  • పాడేరు, అరకు, ఎస్.కోట, విశాఖ దక్షిణ నియోజకవర్గాలలో పర్యటన
  •  సాక్షి, విశాఖపట్నం :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగాజిల్లాలో వైఎస్సార్ జనభేరి రెండో విడత  రెండో రోజూ కొనసాగించనున్నారు. ఆదివారం పాడేరు, అరకు, విజయనగరం జిల్లాలోని ఎస్.కోట, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విజయమ్మ ప్రచారం నిర్వహిస్తారని పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాడేరు, అరకు, ఎస్.కోట నియోజకవర్గాల్లో ఒక్కో చోట నిర్వహించే బహిరంగ సభల్లో విజయమ్మ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మాత్రం రోడ్ షో నిర్వహిస్తారని వెల్లడించారు.
     
    పర్యటన షెడ్యూల్
    ఉదయం 10 గంటలకు పాడేరు నియోజకవర్గంలోని పాడేరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
     
    మధ్యాహ్నం 12 గంటలకు అరకు నియోజకవర్గంలోని అరకు సభలో ప్రసంగిస్తారు.
     
    మధ్యాహ్నం 3 గంటలకు ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్తవలస బహిరంగ సభలో మాట్లాడతారు.
     
    సాయంత్రం 5 గంటలకు విశాఖ దక్షిణ నియోజక వర్గంలోని రెల్లివీధి, 6 గంటలకు కోటవీధి మీదుగా రోడ్ షో నిర్వహించి రాత్రి 7 గంటలకు మనోరమ థియేటర్‌కు చేరుకుని అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడటంతో ఆదివారంనాటి పర్యటనను ముగిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement