టుడే న్యూస్‌ రౌండప్‌

Today News Roundup 16th July 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీలో ఎన్నడూ.. ఎక్కడా అభివృద్ధి జరగలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ అటకెక్కాయని ఎద్దేవా చేశారు. మహిళలకు పది వేలు ఇచ్చామంటూ ఇప్పుడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని బొత్స మండిపడ్డారు. 

‘చంద్రబాబు రాజగురువును కలిసిన అమిత్‌ షా’
సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీలో ఎన్నడూ.. ఎక్కడా అభివృద్ధి జరగలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ అటకెక్కాయని ఎద్దేవా చేశారు.

‘అక్కడి నుంచే తెలంగాణకు రెండో సీఎం’
సాక్షి, భువనగిరి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, నల్గొండ(ఉమ్మడి) జిల్లాకు చెందిన వ్యక్తే సీఎం అయి తీరుతారని ఆ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన 104 ఉద్యోగులు
సాక్షి, అనపర్తి : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనపర్తి నియోజకవర్గంలోని పెద్దాడ చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు, పార్టీ నేతల నుంచి ఘనస్వాగతం లభించింది. 

టాలీవుడ్‌లో డ్రగ్స్‌.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు విధివిధానాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ వినియోగంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను

యూనివర్సిటీలకు సుప్రీం షాక్‌
సాక్షి, న్యూఢిల్లీ : యూనివర్సిటీలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ, ప్రవేటు యూనివర్సిటీలు ఏకపక్షంగా ఫీజలు పెంచకూడదంటూ అత్యన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

భార్య శవం పక్కనే వారం రోజులు
దొడ్డబళ్లాపురం : గుండెపోటుతో మృతి చెందిన భార్య శవాన్ని కూడా ముట్టుకోలేని స్థితిలో అచేతనంగా ఉన్న భర్త శవం పక్కనే వారం రోజులు గడిపిన సంఘటన కారవారలోని కేహెచ్‌బీ కాలనీలో చోటుచేసుకుంది.

టీటీడీ నిర్ణయంతో ఆ విషయం బట్టబయలైంది!
సాక్షి, తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అవకతవకలు జరిగాయని టీటీడీ తాజా  నిర్ణయంతో బట్టబయలయిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా  అన్నారు. 

శరత్‌ హంతకుడ్ని కాల్చిచంపారు
మిస్సోరి: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన శరత్‌ కొప్పు(తెలంగాణ.. వరంగల్‌ చెందిన వ్యక్తి)ని.. ఈనెల 4వ తేదీన ఓ స్టోర్ లో నిందితుడు కాల్చి చంపాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. 

మిమ్మల్ని మిస్‌ అవుతున్నా: నాగ్‌​
నాగార్జున ‘మనం’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ అతిథి పాత్రలో నటించారు. తాజాగా నాగ్‌ కూడా అమితాబ్‌ నటిస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో ఓ కీలక పాత్రను పోషించస్తున్నారు. ఈ మూవీలో అమితాబ్‌ ఓ కీ రోల్‌ను పోషించగా రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్‌లు లీడ్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు.

ఏడేళ్ల తర్వాత టీమిండియా..
లార్డ్స్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 86 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే రెండో వన్డేలో కోహ్లి అండ్‌ గ్యాంగ్‌  తన ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్‌ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.

అమ్మకాల ఒత్తిడి : పతనమైన మార్కెట్లు
ముంబై :
ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి అటూఇటుగా ఊగిసలాటలో ఉన్న దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరిలో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో ఒక్కసారిగా మార్కెట్లు పతనమయ్యాయి.

ఫ్రాన్స్‌ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి
విశ్వవేదికపై ఫ్రాన్స్‌ త్రివర్ణం ఉవ్వెత్తున ఎగరడంతో ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో వారు పారిస్‌ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకల్లో విషాదం నెలకొంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top