మిమ్మల్ని మిస్‌ అవుతున్నా: నాగ్‌​

Nagarjuna Tweet About Brahmastra Movie Team Members - Sakshi

నాగార్జున ‘మనం’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ అతిథి పాత్రలో నటించారు. తాజాగా నాగ్‌ కూడా అమితాబ్‌ నటిస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో ఓ కీలక పాత్రను పోషించస్తున్నారు. ఈ మూవీలో అమితాబ్‌ ఓ కీ రోల్‌ను పోషించగా రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్‌లు లీడ్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ బల్గేరియాలో జరుగుతోంది.

ఈ షెడ్యుల్‌లో నాగార్జున పాల్గొన్నారు. షెడ్యుల్‌ కంప్లీట్‌ అయ్యాక చిత్ర బృందంతో దిగిన ఫోటోలను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్‌లో తన పార్ట్‌ను కంప్లీట్‌ చేసుకున్న నాగ్‌.. చిత్రయూనిట్‌ను మిస్‌ అవుతున్నట్లు ట్వీట్‌ చేశాడు. నాగ్‌ ప్రత్యేక పాత్రలో నటించినందుకు చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. దీనిపై నాగ్‌ స్పందిస్తూ.. కరణ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ‘ఏ జవానీ హై దీవానీ’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top