షార్ట్‌సర్క్యూట్‌తో షాపు దగ్ధం | shop burned with short circuit | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో షాపు దగ్ధం

Jan 7 2014 4:36 AM | Updated on Sep 2 2017 2:21 AM

జగిత్యాల యావర్‌రోడ్డు క్లబ్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న స్నేహ వీడియో మిక్సింగ్ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ జరిగి సామగ్రి కాలిపోయింది.

 జగిత్యాల, న్యూస్‌లైన్ : జగిత్యాల యావర్‌రోడ్డు క్లబ్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న స్నేహ వీడియో మిక్సింగ్ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ జరిగి సామగ్రి కాలిపోయింది. రూ.8.50లక్షల నష్టం వాటిల్లింది. మిక్సింగ్ యూనిట్ యజమాని లింగం సత్యనారాయణ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. దుకాణాన్ని పెంట సత్యనారాయణ నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే పెంట సత్యనారాయణ ఆదివారం రాత్రి షాపు మూసి ఇంటికెళ్లాడు.

మిక్సింగ్ యూనిట్‌లో ఉన్న ఇన్‌వర్టర్‌తో షార్ట్‌సర్క్యూట్ జరిగి నాలుగు కంప్యూటర్లు, మూడు వీడియో కెమెరాలు, రెండు ఫొటో కెమెరాలు, కలర్, బ్లాక్ అండ్‌వైట్ జిరాక్స్ మిషన్లు, పెళ్లి అల్బమ్‌లు, 70-80 పెళ్లి సీడీలతోపాటు మిక్సింగ్ చేసే ఇతర సామగ్రి, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. సోమవారం వేకువజామున షాపు శుభ్రం చేసే వ్యక్తి రాగా, పొగరావడం గమనించి పక్కనే ఉన్న మరోషాపు యజమాని జాన్సన్‌కు చెప్పాడు. ఆయన వచ్చి చూసి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం చేరవేశాడు. కానీ అప్పటికే సామగ్రి బుగ్గిపాలయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నిర్వాహకుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement