భోగాపురంలో విమానాశ్రయం అనుకూలం కాదా? | Not suitable for bhogapuranlo airport ? | Sakshi
Sakshi News home page

భోగాపురంలో విమానాశ్రయం అనుకూలం కాదా?

May 5 2015 11:14 PM | Updated on Sep 3 2017 1:29 AM

భోగాపురంలో నిర్మించనున్న విమానాశ్రయానికి సాంకేతికపరంగా ప్రతికూల వాతావరణం ఉన్నట్టు తెలిసింది.

భోగాపురం (విజయనగరం): భోగాపురంలో నిర్మించనున్న విమానాశ్రయానికి సాంకేతికపరంగా ప్రతికూల వాతావరణం ఉన్నట్టు తెలిసింది. విమాన రాకపోకలకు గాలి దిశ బాగోలేదని సాంకేతిక సిబ్బంది గుర్తించినట్టు సమాచారం. ఈ మేరకు వారు ప్రభుత్వానికి నివేదిక అందించారు. విమానాశ్రయం ఏర్పాటు విషయమై ఈనెల 15న విశాఖలో మంత్రులు విజయనగరం, విశాఖ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. అయితే నివేదికను పరిగణలోకి తీసుకుని విమానాశ్రయం నిర్మాణంపై ప్రభుత్వం వెనుక్కు తగ్గుతుందా...లేక ముందుకే వెళుతుందా అన్నది తేలాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement