అధికార అండ... దౌర్జన్యకాండ | Mlc payyavula keshav and his brother illigal activities | Sakshi
Sakshi News home page

అధికార అండ... దౌర్జన్యకాండ

Aug 31 2015 3:31 AM | Updated on Aug 10 2018 8:16 PM

అధికార అండ... దౌర్జన్యకాండ - Sakshi

అధికార అండ... దౌర్జన్యకాండ

టీడీపీ ఎమ్మెల్సీ పయ్యూవుల కేశవ్, ఆయున సోదరుడు పయ్యూవుల శ్రీనివాసులు అలియాస్ శీనప్ప అధికారాన్ని

♦ వై.రాంపురంలో మితిమీరిన పయ్యూవుల సోదరుల ఆగడాలు
♦ సూరయ్యు హత్య కేసు నుంచి బయుటపడడానికి శీనప్ప కుట్రలు
♦ రాజీకి రావాలంటూ సూరయ్యు భార్యకు తీవ్రస్థారుులో బెదిరింపులు
♦ పొలంలో విత్తిన ఉలవ పంటను ట్రాక్టర్లతో దున్నేయించిన వైనం
 
 అనంతపురం : టీడీపీ ఎమ్మెల్సీ పయ్యూవుల కేశవ్, ఆయున సోదరుడు పయ్యూవుల శ్రీనివాసులు అలియాస్ శీనప్ప అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉరవకొండ నియోజకవర్గంలో దౌర్జన్యకాండకు దిగుతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయుకులు, కార్యకర్తలే లక్ష్యంగా భయుభ్రాంతులకు గురిచేస్తున్నారు. మరీముఖ్యంగా ఉరవకొండ వుండల పరిధిలోని వై.రాంపురం గ్రావుంలో సూరయ్యు కుటుంబ సభ్యులకు నిత్యం ఏదో రకంగా వేధిస్తున్నారు. 2009లో సూరయ్యు కాంగ్రెస్‌కు వుద్దతు పలుకుతున్నాడంటూ దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పయ్యూవుల శీనప్ప ముద్దాయిగా ఉన్నారు.

ఎలాగైనా సూరయ్యు భార్య ఓబుళవ్ముతో కేసును రాజీ చేసుకోవాలని భావించి... ఆమెతోపాటు సూరయ్యు తల్లి శాంతవ్మును ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతం ఓబుళవ్ము వైఎస్సార్‌సీపీ వుహిళా విభాగం జిల్లా కమిటీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. పార్టీ నుంచి బయటకు రావాలంటూ గ్రావుంలోని కొంతవుంది టీడీపీ గుండాలతో బెదిరిస్తున్నారు. శనివారం ఓబుళమ్మ ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన  ప్రత్యేక హోదా బంద్‌లో పాల్గొన్నారు. ఇదే సమయంలో పొలంలో వారం క్రితం విత్తిన ఉలవ పంటను పయ్యూవుల శీనప్ప అనుచరులు 10 వుంది ట్రాక్టర్లతో పాసి వేయించారని ఓబుళమ్మ తెలిపారు.

‘‘నా భర్తను దారుణంగా హత్య చేరుుంచిన పయ్యూవుల శీనప్పకు ఈ కేసులో  శిక్ష పడుతుందని తెలుసుకొని రాజీకి రావాలని ఎంతోవుందితో దౌర్జన్యం చేరుుస్తున్నాడు. వై.రాంపురంలో నాకు  271, 272, 273, 274 సర్వే నెంబర్లలో 11.36 ఎకరాల భూమి ఉంది.  ఇందులో వారం కిత్రం ఉలవ పంట వేశాను. మొలకెత్తుతున్న దశలో ఉండగా  పాసివేశారు. అతని దౌర్జన్యాలకు భయపడకుండా, రాయ‘బేరాల’కు తలొగ్గకుండా ఉన్నందుకే ఇలాంటివి చేయిస్తున్నాడు. వీటిపై అధికారులు, పోలీసులు కూడా నోరు మెదపకపోవడం ఎంతో బాధిస్తోంద’’ని ఓబుళమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement