నేడు కూడా కొనసాగనున్న వడగాల్పులు | Heat waves in ap and telangana | Sakshi
Sakshi News home page

నేడు కూడా కొనసాగనున్న వడగాల్పులు

May 29 2015 10:07 AM | Updated on Aug 18 2018 9:18 PM

తెలుగు రాష్ట్రాలలో నేడు కూడా వడగాల్పులు కొనసాగనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది.

విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలలో నేడు కూడా వడగాల్పులు కొనసాగనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా, దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల అల్పపీడన ద్రోణులు కొనసాగుతున్నాయని తెలిపింది. అయితే ఒకటి, రెండు చోట్లు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షపు జల్లులు పడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement