పట్టాలు తప్పిన గూడ్స్ రైలు | goods train derails near bezawada junction | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Sep 7 2015 1:35 AM | Updated on Sep 3 2017 8:52 AM

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

గూడ్స్ వ్యాగన్ ఒకటి విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

విజయవాడ: గూడ్స్ వ్యాగన్ ఒకటి విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖగారియా (పశ్చిమ బెంగాల్) నుంచి చాలపూడి (కోయంబత్తూరు) వెళ్లే గూడ్స్ రైలు విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ట్రిప్ షెడ్ సమీపంలో ట్రాక్ సరిగా లేకపోవడంతో అందులోని ఒక వ్యాగన్ ఆదివారం మధ్యాహ్నం 1.50 సమయంలో పట్టాలు తప్పింది. దీంతో విజయవాడ- గుంటూరు- తెనాలి మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడలోనే నిలిపివేసి విజయవాడ నుంచే తిరిగి సికింద్రాబాద్‌కు పంపారు. ఇదే రైలులో గుంటూరుకు వెళ్లాల్సిన ప్రయాణికులను నర్సాపూర్- నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లో పంపించారు. వ్యాగన్ పట్టాలు తప్పగానే బ్రేక్ సిబ్బంది వచ్చి మరమ్మతులు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement