మహిళపై అత్యాచారానికి యత్నించిన యువకులకు దేహశుద్ధి | Gang rape attempt of a woman | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారానికి యత్నించిన యువకులకు దేహశుద్ధి

Jul 25 2015 3:43 PM | Updated on Jul 28 2018 8:51 PM

ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడబోతుండగా గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు.

కృష్ణగిరి (కర్నూలు) : ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడబోతుండగా గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని కడారికుంట గ్రామశివార్లలో శనివారం చోటుచేసుకుంది. మహిళ ఒంటరిగా వెళ్తుండటం చూసి మద్యం తాగిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించి అత్యాచారం చేయబోయారు.

అదే సమయంలో అటువైపు ఆటోలో వెళ్తున్న కడారికుంట గ్రామస్తులు ఇది గమనించి.. యువకులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన యువకులంతా డోన్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన వారు. వీరిలో ఒకరు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement