జిల్లా ఏజెన్సీలో మావోయిస్టుల యత్నం
సరిహద్దుల్లో నాలుగు దళాల సంచారం
మొగ్గలోనే తుంచాలనుకుంటున్న పోలీసులు
తూర్పు మన్యంలో ఒకనాడున్న పట్టున్న తిరిగి సాధించాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నాలుగు దళాలుగా విడిపోయి యువకులును ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో ప్రాబల్యం ఉన్న గ్రామాలను సందర్శించి, బలసమీకరణ చేస్తున్నారు. క్రమంగా ఏజెన్సీ అంతా విస్తరించాలన్నది వారి సంకల్పం. కాగా మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ.. మొగ్గలోనే తుంచేయాలని పోలీసులు భావిస్తున్నారు.
రంపచోడవరం :జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యువతను ఆకట్టుకోవడం ద్వారా మునుపటి బలాన్ని సముపార్జించాలని మావోయిస్టులు ఆశిస్తున్నారు. అయితే వారు అటువైపు ఆకర్షితులు కాకుండా చూసేందుకు పోలీసులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్న సానుభూతిపరులు, మిలీషియా సభ్యులను కట్టడి చేసి వారికి ఎటువంటి సహకారం అందకుండా చర్యలు చేపట్టారు. జిల్లాలో మావోయిస్టు పార్టీ బలంగా ఉన్నప్పుడు మిలిటరీ ప్లాటూన్లుగా, దళాలుగా సంచరిస్తూ తమ కార్యకలాపాలు సాగించింది. అనంతర కాలంలో జరిగిన పరిణామాలతో తూర్పు ఏజెన్సీలో మావోయిస్టులు పూర్తిగా పట్టుకోల్పోయారు. అప్పుడు ఎల్లవరం, కోనలోవ, కోరుకోండ , గాలికొండ, గుర్తేడు వంటి పేర్లతో దళాలు విస్తృతస్థాయిలో పనిచేశాయి.
పరిస్థితులు తారుమారు కావడంతో ఆత్మరక్షణ లో పడ్డ మావోయిస్టులు ఒకే గ్రూపుగా సంచరిస్తూ విశాఖ, తూర్పు సరిహద్దు ప్రాంతానికి పరిమితమయ్యారు. మావోయిస్టు ఉద్యమం వైపు వెళ్లేందుకు గిరిజనులు సైతం విముఖత చూపడంతో ఆ పార్టీకి క్యాడర్ అనేది లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం తిరిగి మళ్లీ తూర్పు-విశాఖ సరిహద్దులో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుత మావోయిస్టులు నాలుగు దళాలుగా విశాఖ, తూర్పు సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తున్నట్టు సమాచారం. వీటిలో ఒక గ్రూపునకు ఒడి శాకు చెందిన నాయకుడు నేతృత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో గ్రూపునకు కుడుముల రవి సారథ్యం వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ ప్రాంతంపై పట్టు ఉంటుందనే ఉద్దేశంతో మావోయిస్టు పార్టీ ాయకులు రవికి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
నిధుల సమీకరణ యత్నానికి గండి
కాగా తూర్పు ఏజెన్సీలో పట్టు కోల్పోయిన మావోయిస్టులు తిరిగి బలపడే క్రమంలో నిధులు సమీకరించకుండా నిరోధించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీంతో మావోయిస్టులకు నిధుల సమీకరణ కష్టతరంగా మారిందంటున్నారు. మావోయిస్టుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేసేందుకు ఎవరూ సాహసించకపోవడం, అలాగని మావోయిస్టులే నేరుగా వెళ్లి నిధులు సేకరించే అవకాశాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారర లేదని పోలీసులు అంటున్నారు. విశాఖ-తూర్పు సరిహద్దులో మాత్రమే వారి కదలికలు ఉన్నట్లు చెబుతున్నారు. కాగా జిల్లాలో ఖమ్మం నుంచి విలీనమైన మండలాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆ ప్రభావం తూర్పు ఏజెన్సీపై పడకుండా పోలీసులు మావోయిస్టుల అణచివేతకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన సోమవారం న్యూఢిల్లీలో మావోయిస్టుల సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు పాల్గొనే సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కూడా మన్యంలో మునుముందు ఏమి జరగనుందో నిర్దేశించగలవు.
జిల్లా ఏజెన్సీలో మావోయిస్టుల యత్నం
Published Mon, Feb 9 2015 4:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement