సోము వీర్రాజు మద్దతుగా రాజీనామాలు | BJP Leaders Resignations Somu Veerraju Support | Sakshi
Sakshi News home page

సోము వీర్రాజు మద్దతుగా రాజీనామాలు

May 14 2018 2:33 PM | Updated on Mar 29 2019 9:12 PM

BJP Leaders Resignations Somu Veerraju Support - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవి సోము వీర్రాజు దక్కకక పోవడం దారుణమని ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంతో పట్ల వీర్రాజు వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

గత 39 ఏళ్ళుగా పార్టీకి సేవలు అంధించిన వీర్రాజుకు అన్యాయం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు అన్నారు. వీర్రాజుకు మద్దతుగా బొమ్ముల దత్తు రాజీనామ చేశారు. మరోవైపు జిల్లా రూరల్‌, అర్బన్‌ అధ్యక్షులు, అదేవిధంగా ఆ వర్గం నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు. తదుపరి నిర్ణయాలు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశంలో వెల్లడిస్తామని వీర్రాజు వర్గీయులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement