జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో ‘అసెంబ్లీ’ | At the end of January or February, "Assembly" | Sakshi
Sakshi News home page

జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో ‘అసెంబ్లీ’

Dec 29 2016 1:59 AM | Updated on Jul 29 2019 2:44 PM

జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో ‘అసెంబ్లీ’ - Sakshi

జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో ‘అసెంబ్లీ’

జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు.

స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు

కారంపూడి: జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న మాజీ ఎమ్మెల్యే కొర్రపాటి వెంకట సుబ్బారావును బుధవారం ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో జరుగుతాయని తెలిపారు. తాత్కాలిక సచివాలయంలో 10–15 సంవత్సరాలు సమావేశాలు జరిగే అవకాశం ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement