ఐటమ్‌ గర్ల్స్‌కు ధీటుగా..

సుస్మీతా సేన్‌, సంజయ్‌ కపూర్‌లు జంటగా వచ్చిన ‘సిర్ఫ్‌ తుమ్‌’ సినిమాలోని ‘దిల్‌బార్‌.. దిల్‌బార్‌’ గుర్తుందా..? అప్పట్లో ఈ సాంగ్‌ ఓ సెన్షేషన్‌ని క్రియేట్‌ చేసింది. ఈ మధ్య కాలంలో జాన్‌ అబ్రహాం హీరోగా వచ్చిన ‘సత్యమేవ జయతే’లో కూడా ఈ పాటను రిమేక్‌ చేశారు. నోరా ఫతేహీ బెల్లీ స్టేప్పులతో ఈ పాటకు మరోసారి క్రేజ్‌ పెంచేశారు. కానీ ప్రస్తుతం సోషయల్‌ మీడియాలో వైరలవుతోన్న ఓ డ్యాన్సర్‌ సుస్మీతా సేన్‌కి, నోరాకు గట్టి పోటీ ఇస్తున్నాడు. బెల్లీ మూవ్‌మెంట్‌లో నోరానే కాదు ఐటమ్‌ గర్ల్స్‌ అందరూ తన ముందు దిగదుడుపే అంటున్నాడు ఈ కాలేజీ యువకుడు.

‘దిల్‌బర్‌’ సాంగ్‌కు ఈ అబ్బాయి వేసిన స్టేప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ యువకుడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మీరు ఓ సారి ఈ వీడియో చూడండి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top