వారం రోజుల క్రితం తమ బిడ్డలను పోలీసులు తీసుకెళ్లారని కనీసం వారితో ఫోన్‌లో గానీ నేరుగా వెళ్లి మాట్లాడలేకపోయామంటూ ఆ నలుగురి తల్లిదండ్రులు బోరుమంటున్నారు. కడసారి చూపుకైనా నోచుకుంటామని రోదిస్తూ శుక్రవారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వేచి చూశారు. చివరకు మృతదేహాలు రావడం లేదని సమాచారం అందడంతో కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు తమ బిడ్డలను ఏకపక్షంగా ఎన్‌కౌంటర్ చేశారంటూ మృతుల కుటుంబసభ్యులు శనివారం ఉదయం కూడా గుడిగండ్ల ప్రధాన రహదారిపై బైఠాయించి పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ ధర్నాకు దిగారు. గ్రామస్తులు కూడా వారికి మద్దతు తెలిపారు.
మృతదేహాల కోసం ఎదురుచూపులు
Dec 7 2019 11:17 AM | Updated on Dec 7 2019 11:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement