560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు | 560 Crores For YSR Kanti Velugu | Sakshi
Sakshi News home page

560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు

Sep 18 2019 7:37 AM | Updated on Sep 18 2019 7:46 AM

రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది ప్రజలకు ఆరు విడతలుగా వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం కింద కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మూడేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటికి సంబంధించిన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రూ.560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నామని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద జరుగుతాయని చెప్పారు. ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement