క్యాన్సర్‌తో పోరాటంలో ఒక కాలు కోల్పోయినా.

ఒక కాలుపై కొద్దిసేపు నిల్చోడమే కష్టం. అలాంటింది ఓ చిన్నారి తనకు ఒక కాలు లేకపోయినా.. అద్భుతమైన డ్యాన్స్‌ ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. వివరాల్లోకి వెళితే.. అంజలి అనే 11 ఏళ్ల చిన్నారి క్యాన్సర్‌తో పోరాటంలో తన ఒక కాలును కోల్పోవాల్సి వచ్చింది. అయినా తాను ఏ మాత్రం అధైర్య పడలేదు. పట్టుదలతో ముందుకు సాగింది. ఇటీవల కోల్‌కతాలో జరిగిన మెడికల్‌ కాన్ఫరెన్స్‌లో డ్యాన్స్‌ ప్రదర్శన ఇచ్చింది. శ్రేయా ఘోషల్‌ పాడిన ‘మేరే డోల్‌నా సున్‌’కు ఒక కాలుతోనే డ్యాన్స్‌ చేసి ఆశ్చర్యపరిచింది. ఆ సాంగ్‌ బీట్స్‌కు తగ్గట్టు పాస్ట్‌ బీట్‌ స్టెప్పులతో అక్కడికి వచ్చిన వారి హృదయాలను దోచుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top