శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మునిసిపల్ ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు నామినేషన్ల ప్రక్రియను అరాచక పర్వంగా మార్చారు. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక మున్సిపల్ కార్యాలయం, బీఎస్సార్ మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో నామినేషన్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. అయితే కూటమి పార్టీలైన బీజేపీ, టీడీపీ నాయకులు పక్కా ప్రణాళికతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా దౌర్జన్యానికి పాల్పడుతూ భౌతిక దాడులకు దిగారు. నామినేషన్ పత్రాలను చించివేశారు. నామినేషన్ కేంద్రం పరిసర ప్రాంతాలలో వందల సంఖ్యలో ముందస్తుగా తిష్టవేశారు. తొలుత మున్సిపల్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రావడంతో వారు అడ్డుకున్నారు. ఏకబిగిన దౌర్జన్యానికి దిగారు.
ధర్మవరంలో నామినేషన్ల వేళ కూటమి నేతల దౌర్జన్యం!
Oct 16 2026 10:43 PM | Updated on Oct 16 2026 10:43 PM
Advertisement
Advertisement
Advertisement
