-
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
పెళ్లి చేసుకునేది కలకాలం కలిసుండటానికే! విడిపోతారని ముందే తెలిస్తే పెళ్లెందుకు చేసుకుంటారు? ప్రేమ దగ్గరే ఆగిపోతారు. అయినా అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న ఎంతోమంది పలు కారణాల వల్ల ఆ బంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు. అందులో మలయాళ హీరోయిన్ భామ కూడా చేరింది. భర్తతో విడిపోయిన విషయాన్ని తొలిసారి అధికారికంగా వెల్లడించింది.సింగిల్ మదర్ అయ్యాకే..ప్రస్తుతం తాను సింగిల్ పేరెంట్ అని తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'నేను చాలా స్ట్రాంగ్ అని ఇంతవరకూ తెలీలేదు. సింగిల్ మదర్ అయిన తర్వాతే ఈ విషయం తెలిసొచ్చింది. ఇప్పుడు ధృడంగా నిలబడటమే నా ముందున్న ఏకైక ఛాయిస్. నా కూతురికి నేను.. నాకు నా కూతురు' అంటూ తన పాపతో ఆడుకుంటున్న ఫోటో పోస్ట్ చేసింది. ఇది చూసిన జనాలు నువ్వు చాలా ధైర్యవంతురాలివి.. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అని కామెంట్లు చేస్తున్నారు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంకాగా భామ.. 2020లో అరుణ్ జగదీశ్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. గత కొంతకాలంగా భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే మానేసింది నటి. ఇంతలోనే తను భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. అందుకుగల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈమె తెలుగులో మంచివాడు అనే మూవీలో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Bhamaa (@bhamaa) చదవండి: తమిళంలో ఇటీవలే రిలీజ్.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి! -
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
‘ది కేరళ స్టోరీ’తో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది అదాశర్మ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో హార్ట్ అటాక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినా.. అదా శర్మను మాత్రం స్టార్ హీరోయిన్గా చేయలేకపోయింది. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు లేడి ఓరియెంటెండ్ చిత్రాల్లో నటించినా.. ఫేమ్ రాలేదు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘ది కేరళ స్టోరీ’తో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాదిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో పాటు అదా శర్మను పాన్ ఇండియా హీరోయిన్గా మార్చేసింది. అదే జోష్‌లో ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తోసేన్తోనే ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ అనే సినిమా చేసింది. ఈ ఏడాది మార్చి 15న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకొని అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందు ఈ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో కేవలం మావోయిస్టుల హింసనే ఎక్కువ చూపించారని, సంచలనం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే విమర్శలు వచ్చాయి. విడుదల తర్వాత ప్లాప్ టాక్ రావడంతో ఎవరూ ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మే 17 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ 5 సంస్థ ఎక్స్(ట్విటర్) వేదికగా తెలియజేస్తూ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఇందులో అదాశర్మ మావోయిస్టులను అణచివేయడానికి నియమితురాలైన ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్గా నటించింది. An internal war that has the country divided into two fractions. Watch the gruesome story of Naxal violence.#Bastar premieres 17th May, only on #ZEE5. Available in Hindi and Telugu. #BastarOnZEE5 pic.twitter.com/IUFXrNnkqq— ZEE5 (@ZEE5India) May 8, 2024 -
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
'సేవ్ ద టైగర్స్', 'సైతాన్' సిరీస్‌లతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న దేవయాని శర్మకు ఇప్పుడు ఊహించని కష్టం వచ్చి పడింది. ఆమె ఉపయోగిస్తున్న ఫోన్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. దీని వల్ల మానసికంగా తాను ఎంతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా సరే స్పందించొద్దని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.(ఇదీ చదవండి: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?)దేవయాని ఏం చెప్పింది?'కొన్నిరోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయింది. నా వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. అయితే ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలీదు. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నాను. అలానే నా వాట్సాప్ కూడా హ్యాక్ అయింది. ఎందుకంటే ఫోన్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవేళ నా నంబర్ నుంచి ఎవరికైనా ఎలాంటి మెసేజులు వచ్చినా స్పందించొద్దు. ఎందుకంటే అది నేను కాదు''ఇప్పటికే దీని వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అలానే మూడుసార్లు ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. కాబట్టి నా నంబర్ నుంచి ఎలాంటి మెసేజులు వచ్చిన చేస్తున్నది నేను కాదని అర్థం చేసుకోండి. వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇదేదే నా పరువు తీసి, చెడుగా ప్రాజెక్ట్ చేసే ఉద్దేశంతో చేస్తున్నారని అనిపిస్తుంది. మామూలుగానే ఆర్టిస్ట్ జీవితం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాటితో మరింత కష్టంగా మారుతోంది' అని దేవయాని తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్) -
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2: ది రూల్ మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.అయితే వీరిద్దరి కాంబోలో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఆర్య సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ 20 ఏళ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు తన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం తనకిష్టం లేదని అన్నారు. ఐటమ్ సాంగ్స్ తనకు నచ్చవని సరదాగా కామెంట్స్ చేశారు.సుకుమార్ మాట్లాడుతూ.. 'ఐటమ్ సాంగ్ నాకిష్టం లేదు. అ అంటే అమలాపురం లిరిక్ నాకు నచ్చింది. అది రాసేటప్పుడు టైం లేదు. వేటూరి దగ్గరకు పంపించాను. 'అల్లుగారి పిల్లగాడా' అంటే ఏంటి? అతను నా హీరో ఆర్య.. అల్లుగారి అబ్బాయి కాదు' అని చెప్పా. ఆర్య వచ్చి హీరోయిన్ను వెతుక్కోవాలి కానీ.. అరవింద్ గారి అబ్బాయి అంటే ఈజీగా హీరోయిన్ను పటగొట్టేస్తాడు . ఆర్యకు బైక్ కూడా లేదు.. చాలా పూర్. కేవలం సైకిల్ మాత్రమే ఉంది అంటూ నవ్వారు. నాకిష్టం లేకపోయినా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటం సాంగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది. ఐటమ్ సాంగ్ ఉంటే సినిమాను ఇంత దూరం తీసుకెళ్తుందా?.. ఇంత వైబ్ వస్తుందా? అనే మూడ్‌లోకి వచ్చేశాను. కానీ దిల్ రాజు ఏమో ఒక్క ఐటెం సాంగ్ కూడా లేకుండా కళాత్మకంగా సినిమాలు చేస్తున్నారు' అని అన్నారు. -
కట్టప్పతో స్టార్ హీరో.. ఈ మధ్యే రూ.150 కోట్ల హిట్ మూవీతో..!
నటుడు సత్యరాజ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో బోలెడన్ని సినిమాలు చేశాడు. మొదట్లో విలన్‌గా, తర్వాత హీరోగా.. అనంతరం సహాయక నటుడిగా మెప్పించాడు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో క్లిక్కయ్యాడు. ఈ మధ్య ఇతడు సింగపూర్ సెలూన్ మూవీలో మెరిశాడు. ఫోటో వైరల్తాజాగా ఈ నటుడు యుక్తవయసులో ఉన్నప్పటి ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో సత్యరాజ్ ఓ బుడ్డోడితోపాటు కెమెరావైపు నవ్వులు చిందిస్తున్నాడు. ఈ బుడ్డోడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టర్. ఇతడి తండ్రి కూడా నటుడే! ఆయనతో కలిసి సత్యరాజ్ రెండు సినిమాలు కూడా చేశాడు. ఇంతకీ ఈ చిన్నోడెవరో గుర్తుపట్టారా? తెలుగులో విపరీతమైన పాపులారిటీఅతడే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్. పుష్ప సినిమాతో తెలుగులో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఇతడు ఈ మధ్యే ఆవేశం అనే సినిమాతో మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. 1980లో అతడు సత్యరాజ్‌తో దిగిన ఫోటోను ఓటీటీ ప్లాట్‌ఫామ్ ముబి ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. Sathyaraj and Fahadh Faasil in the 1980s. pic.twitter.com/H9DidxzScV— MUBI India (@mubiindia) May 7, 2024చదవండి: నాన్నతో కోపంలో అన్నా.. అదే నిజమైంది: బన్నీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్‌ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఛాంపియన్‌గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
తప్పక చదవండి
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement