ప్రజాకోర్టులో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదు | Sakshi
Sakshi News home page

ప్రజాకోర్టులో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదు

Published Sun, Nov 26 2023 2:06 AM

సూర్యాపేట మండలం కేటీ అన్నారంలో  మీడియాతో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి   - Sakshi

ఈడీ, ఐటీ దాడులపై రేవంత్‌

బహిరంగ లేఖ హాస్యాస్పదం

రైతు బంధుపై ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు హర్షణీయం

సూర్యాపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి,

మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట రూరల్‌ : ప్రజా కోర్టులో మరోసారి కాంగ్రెస్‌ పార్టీకి భంగపాటు తప్పదని సూర్యాపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నా రు. సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు కలిసి కుట్రపూరితంగా ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గోబెల్స్‌ ప్రచారానికి సిద్ధహస్తుడైన రేవంత్‌కు బీఆర్‌ఎస్‌ నాయకులపై జరుగుతున్న ఐటీ ,ఈడీ దాడులు కనపడటం లేదా అని ప్రశ్నించారు. రేవంత్‌ అబద్ధాలు ఆడుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు రోజురోజుకీ ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా 24గంటల విద్యుత్‌ సరఫరా కావడం లేద న్నారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టి రైతు బంధుని అడ్డుకునే కుట్ర పన్నారని ఆరోపించారు. కానీ, రైతు బంధు అమలు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు ఇవ్వడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌ను 12 సీట్లలో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement
Advertisement