ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

Published Sat, Nov 11 2023 12:46 AM

- - Sakshi

ఈనెల 17న నూజివీడు రాక

నూజివీడు: నూజివీడులో ఈనెల 17న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావుతో కలిసి కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జాయింట్‌ కలెక్టర్‌ లావణ్యవేణి, ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి శుక్రవారం సభాస్థలి, హెలీప్యాడ్‌ కోసం స్థలాలను పరిశీలించారు. విస్సన్నపేట రోడ్డులోని మామిడి పరిశోధనాస్థానం పక్కన ఉన్న 40 ఎకరాల జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ స్థలాన్ని పరిశీలించి ఇక్కడ సభావేదిక, గురుకుల పాఠశాల పక్కన మైదానంలో వాహనాల పార్కింగ్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. మైలవరం రోడ్డులోని పెట్రోల్‌ బంకు సమీపంలో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు పనులు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సభావేదిక ఏర్పాటుచేసే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ స్థలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే ప్రతాప్‌ సూచించారు. సబ్‌కలెక్టర్‌ ఆదర్ష్‌ రాజీంద్రన్‌, డీఎస్పీ ఈడే అశోక్‌కుమార్‌, తహసీల్దార్‌ డీవీఎస్‌ యల్లారావు, ఏపీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దేశిరెడ్డి రాఘవరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పగడాల సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము ఉన్నారు.

జేసీ సమీక్ష : సీఎం పర్యటన నేపథ్యంలో స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా, డివిజనల్‌ అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి సమావేశం నిర్వహించారు. పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పనులకు సంబంధించి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement