చరిత్రలో తొలిసారిగా.. | Sakshi
Sakshi News home page

చరిత్రలో తొలిసారిగా..

Published Mon, Dec 11 2023 12:12 AM

జూరాల జలాశయంలో ప్రస్తుత నీటినిల్వ 
 - Sakshi

ఈ ఏడాది వానాకాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా జూరాలకు వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. అలాగే నెట్టెంపాడుకు సైతం నీటి పంపింగ్‌ అరకొరగానే సాగింది. దీంతో ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిల్వను బట్టి అధికారులు నానాతంటాలు పడుతూ ఖరీఫ్‌లో వారబందీ విధానంతో పంటలకు సాగునీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు చరిత్రలోనే ఆయకట్టుకు అక్టోబర్‌లో వారబందీ విధానం అమలు చేయడం ఇదే తొలిసారి. అలాగే తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలోనూ వర్షాలు పడకపోవడం, ఆగస్టు చివరి వరకు కర్ణాటకలోని టీబీడ్యాం నుంచి ఆర్డీఎస్‌ ప్రాజెక్టుకు నీరు రాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం జూరాల– ఆర్డీఎస్‌ లింకు కెనాల్‌ కింద కూడా వారబందీ విధానం అమలుచేసింది. దీంతో జూరాల ప్రాజెక్టు కింద 0–డిస్ట్రిబ్యూటరీ నుంచి 35– డిస్ట్రిబ్యూటరీ వరకు వాటి కింద సాగైన పంటలకు నాలుగు రోజులపాటు, జూరాల– ఆర్డీఎస్‌ లింకు కెనాల్‌ పరిధిలో 36 డిస్ట్రిబ్యూటరీ నుంచి 38 డిస్ట్రిబ్యూటరీ వరకు వాటి కింద సాగైన పంటలకు మూడురోజుల పాటు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల కింద సాగు చేసిన పంటలు ఇప్పటికే 70 శాతం మేర కోతకు రాగా మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో రానున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement