సమాజ హితం కోరేదే సాహిత్యం | Sakshi
Sakshi News home page

సమాజ హితం కోరేదే సాహిత్యం

Published Mon, Dec 11 2023 12:12 AM

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కవులు  - Sakshi

వనపర్తిటౌన్‌: సాహిత్యం సమాజ హితాన్ని కోరుతుందని జిల్లా ప్రణాళిక అధికారి వెంకటరమణ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో బిచ్చయ్య రచించిన ‘మీ శ్రేయోభి లాషి’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బిచ్చయ్య తన చక్కటి రచనలతో పుస్తకాలు రాయడం అభినందనీయమని కొనియాడారు. నైతిక విలువలు పెంపొందించే బాధ్యత సాహితీవేత్తలపై ఉందని.. కవులు తమ రచనలతో ఈ తరానికి దిశా నిర్ధేశం చేయాలన్నారు. కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆవిష్కరించిన ‘మీ శ్రేయోభిలాషి’ పుస్తకం బిచ్చయ్య రచనలో అరుదైందని, నాలుగు దశాబ్దాలుగా సాహిత్య సృజన చేస్తూ 30కి పైగా పుస్తకాలు రాశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కవులు డా. నాయకంటి నర్సింహశర్మ, వీరబ్రహ్మేంద్రచారి, ఎంఈఓ బిచ్చయ్య, గిరిరాజాచారి, శివరాజలింగం, కందూరు నారాయణరెడ్డి, కొత్తకాపు నారాయణరెడ్డి, ఓంకార్‌, మల్లేశ్వర్‌, నాగేంద్రగౌడ్‌, సత్తార్‌, రాంరెడ్డి, విశ్రాంత ఉద్యోగులు శ్రీనివాసులు, సూర్యనారాయణ, నర్సింహగౌడ్‌, ఉపాధ్యాయులు వెంకట్‌, సుజీత్‌, పాండురంగయ్య, బండారు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement