చంద్రబోస్‌కు గురజాడ విశిష్ట పురస్కారం

గురజాడ సాహితీ చైతనోత్సవం ఆహ్వాన 
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న సమాఖ్య ప్రతినిధులు  - Sakshi

● డిసెంబర్‌ 3న పురస్కారం ప్రదానం ● నవంబర్‌ 30న గురజాడ స్వగృహంలో జ్యోతిప్రజ్వలన, భారీ ర్యాలీ ● ఆహ్వాన పత్రాలు ఆవిష్కరించిన సమాఖ్య

విజయనగరం టౌన్‌: సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు గురజాడ విశిష్ట పురస్కారం అందజేయనున్నట్టు గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధానకార్యదర్శి కాపుగంటి ప్రకాష్‌ తెలిపారు. గురజాడ గ్రంథాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించి న సమావేశంలో ఆహ్వానపత్రికలను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబ ర్‌ 30న నిర్వహించే మహాకవి గురజాడ సాహితీ చైతన్యోత్సవంలో భాగంగా గురజాడ స్వగృహంలో వారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పిస్తామన్నారు. దేశభక్తిగీతాలు, గురజాడ వాడిన వస్తువుల తో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన సాహితీ సదస్సులో ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి ప్రోఫెసర్‌ జర్రా అప్పారావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నారంశె ట్టి ఉమామహేశ్వరరావు గురజాడ సాహిత్యంపై ప్రసంగిస్తారని తెలిపారు. వక్తృత్వం పోటీ విజేతల ప్రసంగం ఉంటుందన్నారు. జాతీయస్థాయిలో ఎంపిక చేసిన పదిమంది కవులు స్వీయకవితా పఠనం చేస్తారన్నారు. డిసెంబర్‌ 3న సాయంత్రం ఆనందగజపతి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాద్‌, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి, మాజీ ఎంపీ డాక్టర్‌ ఝాన్సీలక్ష్మి, నవసాహితీ చైన్నై సంస్థ అధ్యక్షుడు సూర్యప్రకాష్‌ చేతుల మీదుగా చంద్రబోస్‌కు పురస్కారాన్ని ప్రదానంచేస్తామన్నారు. కార్యక్రమానికి ముందు ఈపు విజయకుమార్‌ దర్శకత్వంలో భోగరాజు సూర్యలక్ష్మి బృందం ఆధ్వర్యంలో కేవ లం మహిళలతో మాత్రమే నిర్వహించే కన్యాశుల్క ంలోని అపూర్వ ఘట్టాన్ని ప్రదర్శిస్తారన్నారు. సమావేశంలో సమాఖ్య కోశాధికారి డాక్టర్‌ ఎ.గోపాలరా వు, సాహితీవేత్త డాక్టర్‌ జక్కు రామకృష్ణ, నాలుగెస్సుల రాజు, మానాప్రగడ సాహితీ, గురజాడ ఇందిర, బి.సూర్యలక్ష్మి, చక్రవర్తి, ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top