దశాబ్దాల కల నెరవేరింది | Sakshi
Sakshi News home page

దశాబ్దాల కల నెరవేరింది

Published Wed, May 8 2024 5:10 AM

దశాబ్దాల కల నెరవేరింది

● పెందుర్తి మండలంలో రోడ్ల నిర్మాణం కోసం రూ.25.19 కోట్లు వెచ్చించారు.

● మండలంలో మరో రూ.12కోట్ల రహదారులు టెండర్‌ పూర్తి చేసుకుని ఉన్నాయి.

● పెందుర్తి మండలం పెదగాడి–చింతగట్ల రోడ్డును రూ.5.40కోట్లతో నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణం ఇక్కడి ప్రజల నాలుగు దశాబ్దాల కల. ఆ కలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నెరవేర్చింది.

● రూ.2.99 కోట్లతో సుజాతనగర్‌ ప్రధాన రోడ్డును నిర్మించారు.

● రూ.1.98 కోట్లతో బీఆర్‌టీఎస్‌ రహదారి– పులగానివానిపాలెం రోడ్డు నిర్మాణం చేపట్టారు.

● రూ.12 కోట్లతో పెందుర్తి–సబ్బవరం ప్రధాన రహదారిని నిర్మించారు.

● రూ.కోటితో పాపయ్యరాజుపాలెం–లక్ష్మీపురం రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.

● రూ.2 కోట్లతో పినగాడి–కోట్నివానిపాలెం–గొరపల్లి–గొల్లలపాలెం రహదారి వేశారు.

● సబ్బవరం మండలంలో దాదాపు రూ.10 కోట్లతో రహదారుల నిర్మాణం పూర్తయింది.

● టెక్కలిపాలెం–నాయనమ్మపాలెం–వంగలి–ఒమ్మివానిపాలెం రోడ్డు నిర్మాణం కోసం రూ.3.15 కోట్లు వెచ్చించారు.

● పరవాడలో మండలంలో రూ.9 కోట్లతో రోడ్లు నిర్మాణం చేపట్టారు.

● రూ.2 కోట్లతో తానం–తాడి రహదారి నిర్మించారు.

● జీవీఎంసీ జోన్‌–8 పరిధిలోని రోడ్ల నిర్మాణం కోసం రూ.40 కోట్ల వరకు ఖర్చు చేశారు.

● సబ్బవరం, పరవాడ, పెందుర్తి గ్రామీణ మండలాల్లో తాగునీటి సదుపాయం కోసం రూ.27.45 కోట్లు నిధులు వెచ్చించారు.

Advertisement
Advertisement