పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం | Sakshi
Sakshi News home page

పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం

Published Sat, Nov 18 2023 12:26 AM

-

మహారాణిపేట: పరిశ్రమల ఏర్పాటుకు, నిర్వహణకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన డీఐఈపీసీ(డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ ఎక్స్‌పోర్టు ప్రమోషన్‌ కమిటీ) సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయికాంత్‌వర్మతో పాటు పాల్గొన్న కలెక్టర్‌ పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సింగిల్‌ విండో విధానంలో భాగంగా సులభతర రీతిలో అనుమతులు జారీ చేస్తామని, సమస్యలేమైనా ఉంటే అక్కడిక్కడే పరిష్కరిస్తామన్నారు. ముందుగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ సీహెచ్‌.గణపతి అజెండా అంశాలను వివరించారు. సింగిల్‌ విండో విధానంలో ప్రధాన మంత్రి ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ ప్రొగ్రామ్‌ (పీఎంఈజీపీ) కింద 130 దరఖాస్తులు అందాయని, వాటిలో 84 దరఖాస్తులకు అన్ని రకాల అర్హతలూ ఉన్నాయని చెప్పారు. మరో 38 పరిశీలన దశలో ఉన్నాయన్నారు. ఆటోనగర్‌ పారిశ్రామికవాడలో నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా పైప్‌లైన్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ ఎస్‌.త్రినాథ్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ సీహెచ్‌.గణపతి, ఏడీ రమామణి, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement