Sakshi News home page

ఆగని ఇసుక అక్రమ దందా

Published Thu, Mar 28 2024 7:05 AM

పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌    - Sakshi

పెద్దేముల్‌: అక్రమ ఇసుక వ్యాపారం పెద్దేముల్‌ మండలంలో జోరందుకుంది. వారంలో మూడు లేదా నాలుగు అక్రమ ఇసుక ట్రాక్టర్‌లను పోలీసులు పట్టుకున్న దందా మాత్రం ఆగటం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టానుసారంగా ఇసుకను తోడేస్తున్నారు. బుధవారం మండలంలోని రెంగోండి నుంచి వస్తున్న రెండు ట్రాక్టర్‌లలో అక్రమ ఇసుకను తరలిస్తుండగా పట్టుకొని పెద్దేముల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమ ఇసుకపై దాడులు చేసినా తగ్గక పోవడం సిగ్గు చేటని అధికారులు అంటున్నారు. నిత్యం రెంగోండి శివారులోని వాగుల నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా బహిరంగంగా తరలిస్తున్నారు. గత పది రోజుల క్రితం ఆరు అక్రమ ఇసుక ట్రాక్టర్‌లను సీజ్‌ చేసి జరిమానాలు విధించినా లాభం లేదని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం రూ.600లకు ఓ ట్రాక్టర్‌ అనుమతి ఇస్తున్నా, ఇసుక దళారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంతో ట్రాక్టర్‌ల యజమానులపై పోలీస్‌ కేసు నమోదు చేసి సీజ్‌ చేయాలని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

రెండు ట్రాక్టర్లు సీజ్‌

Advertisement

What’s your opinion

Advertisement