నేదురుమల్లితో ఎస్‌ఐ దురుసు ప్రవర్తన | Sakshi
Sakshi News home page

నేదురుమల్లితో ఎస్‌ఐ దురుసు ప్రవర్తన

Published Tue, May 14 2024 11:40 AM

నేదురుమల్లితో ఎస్‌ఐ దురుసు ప్రవర్తన

వెంకటగిరి రూరల్‌ : వెంకటగిరి నియోజకవర్గంలో సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వెంకటగిరి పట్టణంలోని అమ్మవారిపేట విశ్వోదయ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చారు. బూత్‌లోకి వెళ్లి పోలింగ్‌ సరళిని పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ ప్రసాద్‌ ఆయనతో దురుసుగా ప్రవర్తించారు. పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో నేదురుమల్లి ఎస్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అభ్యర్థినని, పోలింగ్‌ సరళిని పరిశీలించే హక్కు ఉంటుందని తెలిపారు. తననే బయటకు వెళ్లాలని పేర్కొనడం ఎంత వరకు సబబని, సామాన్య ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎక్కడ ఉంటుందని మండిపడ్డారు. డీఎస్పీ పైడేశ్వరరావు అక్కడికి చేరుకుని నేదురుమల్లికి సర్దిచెప్పారు. దీంతో సమస్య సద్దుమణిగింది. ఎస్‌ఐ తీరుపై స్థానికులు మండిపడ్డారు. అదేవిధంగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మధ్యాహ్నం ప్రాంతంలో రాపూరులోని పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్‌ సరిళిని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement