నేడు కలెక్టరేట్‌లో ‘స్పందన’ | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ‘స్పందన’

Published Mon, Nov 20 2023 12:30 AM

మాట్లాడుతున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ మధుబాల  - Sakshi

తిరుపతి అర్బన్‌ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అర్జీలు రాసేందుకు ప్రత్యేకంగా ముగ్గురు వీఆర్‌ఓలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా స్పందనకు హాజరుకావాలని ఆదేశించారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ సాయంత్రం స్పందన నిర్వహించాలని సూచించారు.

చట్టాలపై అవగాహన అవసరం

తిరుపతి అర్బన్‌ : చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని జిల్లా గ్రంథాలయ చైర్‌పర్సన్‌ మధుబాల తెలిపారు. ఆదివారం తిరుపతి అన్నమయ్య సర్కిల్‌ సమీపంలోని జిల్లా గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళ భద్రత కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టంపై సీ్త్రలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతిష్టాత్మక చట్టం అమలుకు రాష్ట్రస్థాయిలో ఇద్దరు మహిళా అధికారులను సైతం నియమించారని వెల్లడించారు. ఈ మేరకు యాప్‌ డౌన్‌లోడ్‌ క్యాంపెయిన్‌ను ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో లైబ్రేరియన్‌ శివ ప్రసాద్‌, దిశ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐలు సుమతి, గిరిజ, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ రత్న ప్రభ, వక్తలు గిరిజాకుమారి, సోనిక ధాగే , తహసున్నీసా బేగం, మునిలక్ష్మి, మీనా కుమారి, మునిరాజా, నాగరాణి, రెడ్డమ్మ పాల్గొన్నారు.

టీటీడీ అన్నప్రసాదం

ట్రస్ట్‌కు విరాళం

తిరుమల : టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు తిరుపతికి చెందిన నైనారు గురువులు, నైనారు శ్రీనివాసులు రూ.11,11,111లను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆదివారం టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి దాతలు చెక్కు అందించారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు ఆక్టోపస్‌ బిల్డింగ్‌ వరకు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 70,686 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 34,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.02 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది.

బోయకొండలో భక్తుల రద్దీ

చౌడేపల్లె: పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారికి విశేషాలంకరణ చేశారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలతోపాటు, జంతు బలులులిచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయంలో ఒకసారిగా భక్తుల రద్దీ పెరగడంతో క్యూలన్నీ కిటకిటలాడాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఆలయ కమిటీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఈఓచంద్రమౌళి పర్యవేక్షించారు. భక్తులకు ఉచిత తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.

వరసిద్ధుని దర్శనానికి 4 గంటలు

కాణిపాకం(యాదమరి): M>×ìæ-´ëMýS… Ð]lÆý‡-íܨ® ѯé-Ķæ$-MýS-ÝëÓ-Ñ$ÐéÇ §ýlÆý‡Ø-¯é-°MìS 4 VýS…rÌS çÜÐ]l$Ķæ$… ç³yýl$-™èl$…-¨. B¨ÐéÆý‡… òÜÌS-Ð]l#-¨¯]l… M>Ð]l-yýl…™ø ÝëÓÑ$ÐéÇ §ýlÆý‡Ø-¯éÆý‡¦… ¿ýæMýS$¢Ë$ ™èlÆý‡-Í-Æ>-Ð]l-yýl…™ø MýS…´ë-Æý‡Š-ె-r-Ã…r$Ï, Æý‡*.150, Æý‡*.100 MýS*ÅÌS±² ¿ýæMýS$¢-ÌS™ø °…yìl-´ùƇ$$, BÌSĶæ$… ÐðlË$-ç³ÌS Ð]lÆý‡MýS$ »êÆý‡$Ë$ ¡Æ>Æý‡$. ©…™ø ÝëÓÑ$-ÐéÇ° §ýlÇØ…-^èl$-Mø-Ð]l-yé-°MìS 4 VýS…rÌS çÜÐ]l$Ķæ$… ç³sìæt…¨. ¿ýæMýS$¢ÌSMýS$ Gr$-Ð]l…sìæ Cº¾…§ýl$Ë$ ÌôæMýS$…yé ÝëÓÑ$ÐéÇ §ýlÆý‡Ø¯]l HÆ>µr$Ï MýSÍ-µ…^éÆý‡$.

కిటకిటలాడుతున్న బోయకొండ ఆలయం
1/1

కిటకిటలాడుతున్న బోయకొండ ఆలయం

Advertisement

తప్పక చదవండి

Advertisement