హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు | two suspects arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు

Apr 20 2025 10:34 AM | Updated on Apr 20 2025 11:09 AM

two suspects arrested In Hyderabad

రాంగోపాల్‌పేట(హైదరాబాద్‌): వ్యభిచార ముఠా వ్యవహారాన్ని రాంగోపాల్‌పేట పోలీసులు రట్టు చేసి ఇద్దరు విటులను అరెస్ట్‌ చేసి, పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపి డబ్బులు సంపాధిస్తున్నట్లు గుర్తించారు. రాంగోపాల్‌పేట ఇన్‌స్పెక్టర్‌ నర్సింగరావు తెలిపిన వివరాల మేరకు.. 

రాంగోపాల్‌పేట పీజీరోడ్డు, బాపూబాగ్‌ కాలనీలోని ఓ భవనం రెండో అంతస్తులో సెక్స్‌ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈనెల 18న పథకం ప్రకారం దాడి చేసి ఇద్దరు విటులతో పాటు ఇద్దరు యువతులను రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్  రాష్ట్రం నుంచి ఉద్యోగాన్వేషణ కోసం నగరానికి వచ్చినట్లు సదరు యువతులు తెలిపారు. 

ఉదోగ్య ప్రయత్నంలో  ఉండగా స్వప్న అనే యువతి పరిచయం అయిందని, చేతన్‌ అనే వ్యక్తితో కలిసి ఈ భవనంలో ఉంటున్నామని వివరించారు. పట్టుబడిన విటులు నగరానికి చెందిన మహ్మయద్‌ అవియాజ్‌ (32), ఫహాద్‌ హుస్సేన్‌ (25)పై కేసులు నమోదు చేశారు. యువతులను షెల్టర్‌హోంకు తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకులు స్వప్న, చేతన్‌ కోసం గాలిస్తున్నామన్నారు.  నిర్వాహకురాలు స్వప్న వాట్సాప్, ఫోన్‌ నంబర్ల ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచార గృహానికి రప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement