5 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు | Summer holidays to telangana high court from 5th may | Sakshi
Sakshi News home page

5 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

May 3 2025 5:30 AM | Updated on May 3 2025 5:30 AM

Summer holidays to telangana high court from 5th may

జూన్‌ 6వ తేదీ వరకు ఇస్తూ రిజిస్ట్రార్ జనరల్‌ ఉత్తర్వులు 

మే 7, 14, 21, 28, జూన్‌ 4న అందుబాటులో వెకేషన్‌ బెంచ్‌లు 

సాక్షి, హైదరాబాద్‌: మే 5 నుంచి జూన్‌ 6 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 5, 12 19, 26, జూన్‌ 2 తేదీల్లో కేసుల ఫైలింగ్, మే 7, 14, 21, 28, జూన్‌ 4 తేదీల్లో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. హెబియస్‌ కార్పస్, ముందస్తు బెయిల్, ట్రయల్‌ కోర్టు తిరస్కరించిన వాటిపై బెయిల్‌ అప్లికేషన్లు, ఇతర అత్యవసర కేసులను సెలవుల్లోని బెంచ్‌ల వద్ద ఫైలింగ్‌ చేయొచ్చని చెప్పారు. లంచ్‌ మోషన్‌ కేసులు, అత్యవసర పిటిషన్ల మెన్షన్‌ (విచారణ కోరడం)లపై డివిజన్‌ బెంచ్‌లో సీనియర్‌ న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు.  

మే 7న.. 
సింగిల్‌ బెంచ్‌: జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ 
డివిజన్‌ బెంచ్‌: జస్టిస్‌ సూరేపల్లి నందా, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు 
మే 14.. 
సింగిల్‌ బెంచ్‌: జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు 
డివిజన్‌ బెంచ్‌: జస్టిస్‌ పుల్ల కార్తీక్, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు 
మే 21.. 
సింగిల్‌ బెంచ్‌: జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు 
డివిజన్‌ బెంచ్‌: జస్టిస్‌ నగేశ్‌ భీమపాక, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు 
మే 28.. 
సింగిల్‌ బెంచ్‌: జస్టిస్‌ కె.శరత్‌ 
డివిజన్‌ బెంచ్‌: జస్టిస్‌ నగేశ్‌ భీమపాక, జస్టిస్‌ లక్ష్మీనారాయణ అలిశెట్టి 
జూన్‌ 4.. 
సింగిల్‌ బెంచ్‌: జస్టిస్‌ కె.సుజన 
డివిజన్‌ బెంచ్‌: జస్టిస్‌ కె.శరత్, జస్టిస్‌ బీఆర్‌ మధుసూదన్‌రావు   

Advertisement
 
Advertisement
Advertisement