హైదరాబాద్: సీతారాంబాగ్‌లో సోమవారం చారిత్రాత్మక ఆలయం వద్ద బీఆర్‌ఎస్‌వీ నాయకుడు నవీన్ ఆధ్వర్యంలో కొందరు గోషామహాల్ నియోజకవర్గానికి చెందిన జి.శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి రావణాసురుడి తరహాలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రీరాముడి తరహాలో మాజీ సీఎం కేసీఆర్ బొమ్మను చిత్రీకరించారు.
రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలిస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సంగతి తెలిసి కాంగ్రెస్ ఫిషరీష్ విభాగం చైర్మన్ మెట్టు సాయికుమార్ అనుచరులతో వచ్చారు. బీఆర్‌ఎస్‌వీ నాయకులపై విరుచుకుపడ్డారు. కొంతమందిని నెట్టివేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ కొనసాగింది. బీఆర్‌ఎస్ నాయకులు ఇచి్చన ఫిర్యాదు మేరకు నవీన్‌తో మరో పదిమందిని మంగళ్‌హాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదు, నిరసనకారులను అరెస్టు చేశామని ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర వెల్లడించారు.
ఇదీ చదవండి: షేర్ మార్కెట్‌లో రూ.35 లక్షల నష్టం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య


