స్పైడర్‌ ‘మ్యాన్‌’! | Rare Spider Shaped Like Human Head Found In Vikarabad District | Sakshi
Sakshi News home page

స్పైడర్‌ ‘మ్యాన్‌’!

Oct 8 2022 2:40 AM | Updated on Oct 8 2022 6:56 AM

Rare Spider Shaped Like Human Head Found In Vikarabad District - Sakshi

తాండూరు టౌన్‌: వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన రామకృష్ణ ఇంట్లో మనిషి తలను పోలిన సాలె పురుగు (స్పైడర్‌)ను కనుగొన్నారు. దాన్ని చూసిన ఆ ఇంట్లోని పిల్లలు స్పైడర్‌ మ్యాన్‌లా ఉందంటూ కేరింతలు కొట్టారు.

సాలె పురుగు వెనుక భాగం అచ్చం మనిషి తల, కళ్లు, నోరును పోలి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్‌నెట్‌ వివరణ ప్రకారం ఇది అరుదైన జాతి సాలె పురుగు అని తెలుస్తోంది. ఇలాంటిది గతంలో చైనా దేశంలో కనిపించినట్టు.. దీని శాస్త్రీయ నామం అరేనియస్‌ మిటిఫికస్‌ అని సమాచారం.   

Advertisement
 
Advertisement
Advertisement