ప్రశ్నించే గొంతులను అణిచివేయడం ప్రమాదకరం.. కేటీఆర్‌ | KTR Slams Five Day Judicial Custody For CJP Leaders, Says Jailing Gen Z Protesters Threatens Democracy, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే గొంతులను అణిచివేయడం ప్రమాదకరం.. కేటీఆర్‌

Oct 14 2026 3:18 PM | Updated on Oct 14 2026 3:37 PM

KTR condemns arrests of CJP leaders

సాక్షి, హైదరాబాద్‌: దేశ భవిష్యత్తు కోసం జెన్‌జీ యువత పోరాడుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకునే యువతను జైలులో పెట్టడం అ భద్రతాభావానికి నిదర్శనమని తెలిపారు. సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాపై ట్రెస్‌పాసింగ్ కేసులు పెట్టడం అన్యాయం జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాలు ప్రదర్శించినందుకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీనా? అని ప్రశ్నించారు. సీజేపీ నేతలకు ఐదు రోజుల కస్టడీ విధించడంపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువతను జైలుకు పంపడం దేశంలో మరో ఎమర్జెన్సీని తలపిస్తోందని నిరసనలు, ఉద్యమాల ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ప్రజాస్వామ్యానికి అసమ్మతే పునాది.. నిరసన తెలిపే హక్కును కాపాడాలిని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం దేశ భవిష్యత్తు కోసం యువత చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎక్సే వేదికగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement