అలర్ట్‌: తెలంగాణకు భారీ వర్ష సూచన | Imd Heavy Rain Forecast To Telangana Districts | Sakshi
Sakshi News home page

ఐఎండీ అలర్ట్‌: తెలంగాణలో వారంపాటు భారీ వర్షాలు !

Jul 15 2024 9:30 AM | Updated on Jul 15 2024 9:50 AM

Imd Heavy Rain Forecast To Telangana Districts

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో  వచ్చే వారం నుంచి పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఆవర్తనం బలపడిన కారణంగా సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి  జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement