ట్యాంక్‌ బండ్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ | Ganesh Immersion 2023: Huge Traffic Jam At Tank Bund Updates Inside - Sakshi
Sakshi News home page

Ganesh Immersion In Hyderabad: నిలిచిపోయిన గణనాథుడు.. ట్యాంక్‌ బండ్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Sep 26 2023 10:31 AM | Updated on Sep 26 2023 4:32 PM

Ganesh Immersion Huge Traffic Jam At Tank Bund Updates  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఓ వాహనం టైర్‌ పంక్చర్‌ కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి.. 

సాక్షి, హైదరాబాద్‌: గణేష్‌ నిమజ్జనంతో ట్యాంక్ బండ్‌పై కోలాహలం నెలకొంది. అయితే ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఓ విగ్రహ తీసుకెళ్తున్న వాహనం నిలిచిపోగా.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.  ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఇది చోటు చేసుకోగా.. దాదాపు ఐదు గంటల పాటు అధికారులు స్పందించలేదని తెలుస్తోంది. 

ట్రాక్టర్‌పై విగ్రహం తీసుకెళ్తుండా.. టైర్‌ డ్యామేజ్‌ అయ్యి వాహనం ఆగిపోయింది. దీంతో ట్యాంక్ బండ్ వద్ద భారీ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. చాలా సేపటి దాకా ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోలేదని వాహనదారులు మండిపడుతున్నారు.

మరోవైపు పీవోపీ(ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌) విగ్రహాల నిమజ్జనం తాత్కాలిక కుంటల్లోనే చేయించాలంటూ జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై ట్యాంక్‌ బండ్‌పై నిన్న నిరసన చేపట్టారు కొందరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement