రెచ్చిపోయిన పచ్చమూకలు | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన పచ్చమూకలు

Published Tue, May 14 2024 11:10 AM

రెచ్చ

గోకర్నపల్లిలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి

రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులు

పొందూరు: ఎన్నికల వేళ టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగారు. వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారు. పొందూరు మండలం గోకర్నపల్లిలో పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే కొట్లాట జరగడంతో 15 నిమిషాల పాటు ఓటింగ్‌ నిలిచిపోయింది. పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదం టీడీపీ, వైఎస్సార్‌సీసీ మధ్య కొట్లాటకు దారితీసింది. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు చింతాడ జీవరత్నం, యతేంద్ర, సంపతిరావు సూర్యనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇరుపార్టీల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం సతీమణి వాణి గోకర్నపల్లి గ్రామానికి చేరుకుని ఆర్‌ఓ నవీన్‌కుమార్‌తో మాట్లాడారు. ఎస్పీ జీఆర్‌ రాధిక కూడా గోకర్నపల్లితో పాటు పలు గ్రామాలను సందర్శించారు. పిల్లలవలస, లోలుగు, బురిడికంచరాం, కింతలి, తోలాపి తదితర గ్రామాల్లోనూ స్వల్ప వివాదాలు, తోపులాటలు జరిగాయి.

అంధవరంలో దాడి

జలుమూరు: మండలంలోని అంధవరం పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సవలాపురం రాముపై అదే గ్రామానికి చెందిన పల్లి శంకరరావు, తిరుమలరావులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లు పడటంతో ఓర్వలేని టీడీపీ వర్గీయులు రెచ్చకొట్టే మాటలు ఆడుతూ ఓటు వేసి వచ్చిన రామును నేలపై దొర్లించి రాయితో కంటి కింద గాయం చేశారు. స్థానిక వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మధుసూదనరావు సిబ్బందితో వెళ్లి పరిస్థితి సద్దుమణిగించారు.

రెచ్చిపోయిన పచ్చమూకలు
1/1

రెచ్చిపోయిన పచ్చమూకలు

Advertisement
 
Advertisement
 
Advertisement