●బైండోవర్‌ అంటే..? | Sakshi
Sakshi News home page

●బైండోవర్‌ అంటే..?

Published Sun, Apr 7 2024 12:45 AM

- - Sakshi

ఇచ్ఛాపురం రూరల్‌: ఎన్నికలు వచ్చాయంటే ఎక్కువగా వినిపించే పదం బైండోవర్‌. పాత నేరస్తులు, రౌడీ షీటర్లను బైండోవర్‌ చేయడం సహజం. ఒక వ్యక్తి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా, ఆయన చర్యలు అనుమానాలకు తావిచ్చినా పోలీసులు ఆ వ్యక్తిని తహసీల్దారు లేదా ఆర్డీఓ ఎదుట హాజరు పరుస్తారు. చట్టవ్యతిరేక పనులు, చర్యలు చేపట్టనని బాండ్‌ పేపర్లపై లిఖితపూర్వకంగా హామీ తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. ఈ ప్రక్రియను బైండోవర్‌ (బాండ్‌ ఫర్‌ గుడ్‌ బిహేవియర్‌) అంటారు. హామీ తర్వాత కూడా తప్పు చేస్తే 24 గంటల్లో సదరు వ్యక్తిని అరెస్టు చేసి భారతీయ శిక్షాస్మృతి 107, 108, 109, 110 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.

Advertisement
Advertisement